ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా పై స్పందన

eenadu cartoonist sridhar sridhar eenadu cartoonist eenadu cartoonist sridhar

0
105
ఈనాడు అంటే శ్రీధర్ కార్టూన్… శ్రీధర్ కార్టూన్ అంటే ఈనాడు అనేరీతిలో పెనవేసుకున్న బంధాన్ని తగదెంపులు చేసేసుకున్నారు కార్టూనిస్ట్ శ్రీధర్. ఆయన ఎందుకు ఈనాడుకు గుడ్ బై చెప్పారనేది ఇంకా వివరాలు వెల్లడి కాలేదు. కానీ ఆయన ఈనాడుకు రాజీనామా చేసిన నేపథ్యంలో Subramanyam Dogiparthi అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఫేస్ బుక్ లో చిన్న వ్యాసం రాశారు. దాన్ని యదాతదంగా దిగువన ఇస్తున్నాం.
రాయల వారికి బంటును కానీ , వంకాయకు కాదు . అందరికీ తెలిసిన కధే . ఇప్పుడు అసలు కధలోకి వస్తా . కార్టూనిస్టు శ్రీధర్ గారి నిష్క్రమణ ఈనాడు నుండి . నిన్నటి నుండి ఆయనను పొగిడే వారు కొందరు . రామోజీరావు గారిని తెగిడే వారు కొందరు . మరి కొందరు శ్రీధర్ గారినీ తెగిడారండోయ్ .
1989 – 94 కాంగ్రెస్ పాలనలో మధ్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని ఆనాటి గవర్నర్ కృష్ణకాంత్ గారి సతీమణి , వావిలాల వారు , రామోజీరావు గారు , తదితరులు బ్రహ్మాండంగా నడిపించారు . చాలామందికి గుర్తుండే ఉండాలి . అప్పుడు ఈనాడులో ఉన్న కార్టూనిస్టు శ్రీధర్ గారు ఒక ప్రతిఙ్ఞ పూనారు . మద్యపానాన్ని నిషేధించేదాకా మామూలు కార్టూన్లు వేయను అని . అందరూ శభాష్ అన్నారు .
ప్రభుత్వం మారింది 1994 చివర్లో జరిగిన ఎన్నికలలో రామారావు గారు CM కాగానే నిషేధించారు . ఆగస్టులో ఆయన్ని దింపేసిన చంద్రబాబునాయుడు గారు ఓ ఆరేడు నెలల తర్వాత నిషేధాన్ని నిషేధించారు . అయినా రామోజీరావు గారి ఈనాడులో ఉన్న కార్టూనిస్టు శ్రీధర్ గారు మరలా ప్రతిఙ్ఞ పూనలేదు .
తర్వాత కొన్నాళ్ళకు వారు గుంటూరు వచ్చారు . మిత్రులు , లోకసత్తా నాయకులు కీ . శే . డాక్టర్ తోటకూర శరత్ ఆయనకు లంచ్ హోస్ట్ చేసారు . నన్నూ ఆహ్వానించారు . భోజనం అయ్యాక ఉండబట్టలేక కాంగ్రెస్ పార్టీ వీరాభిమానిని అయిన నేను అడిగా . ఏంటి సార్ ! నిషేధాన్ని ఎత్తేసాక మీ కార్టూన్ల ప్రతిఙ్ఞ ఏమయిందని !?
పాపం ! ఆయన ఓ నవ్వు నా మొహాన విసిరి నిష్క్రమించారు . నేనూ సమాధానం కోసం పట్టుబట్టలేదు . ఆయన మాత్రం ఏం చేస్తారు !? వారు రామోజీరావు గారికి ఉద్యోగి . మధ్యపాన వ్యతిరేక ఉద్యమానికి కాదు కదా !
పాపం !! గవర్నర్ కృష్ణకాంత్ గారు , వావిలాల వారే ఏం చేయలేక పోయారు . శ్రీధర్ గారు ఎంత !? బహుశా వారికి నేనూ , నా ధర్మసందేహం గుర్తు కూడా ఉండి ఉండవు .
చివరాకరికు నే చెప్పవచ్చేది ఏమిటంటే , సృజనాత్మకత ఉన్న ఎందరో మహానుభావులు తమ కామందులకు బందీలు . ఎక్కువ మంది శ్రీనాధులే ఉంటారు . బమ్మెర పోతనలు ఉండరు.