యాంకర్ శ్రీముఖి ఇంట విషాదం

Anchor Srimukhi house tragedy

0
82

తెలుగులో యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ శ్రీముఖి. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ అందరితో చాలా సరదాగా చలాకీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె ఇంట విషాదం నెలకొంది. శ్రీముఖి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యింది. శ్రీముఖి అమ్మమ్మ కన్నుమూశారు. దాంతో ఆమె ఇంట ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి.

ఏ విషయం అయినా అభిమానులతో పంచుకుంటారు శ్రీముఖి. తాజాగా ఈ విషయం తన అభిమానులతో పంచుకున్నారు. తన అమ్మమ్మ గురించి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు శ్రీముఖి. అమ్మమ్మ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు . నాకు మీరు ఎన్నో విషయాలు నేర్పించారు. మాకు సంతోషం పంచారు. నేను మిమ్మల్ని మిస్ అవుతున్నా మీరంటే నాకు చాలా ఇష్టం.

నా జీవితంలో నేను విన్న గొప్ప ప్రేమకథలో మీది, తాతయ్యది ఒకటి. మీరు తాతయ్యని కలుసుకుంటారు మీ లవ్ స్టోరీ మళ్లీ కొనసాగుతుంది అని ఎమోషనల్ అయింది శ్రీముఖి. బాధ లో ఉన్న శ్రీముఖిని పలువురు యాంకర్లు ఇండస్ట్రీకి సంబందించిన వారు సోషల్ మీడియా ద్వారా పరామర్శిస్తున్నారు.

https://www.instagram.com/p/CTw9ZItJ57-/?utm_source=ig_embed&ig_rid=a44d21b0-fd6c-4dd7-81b1-1d0c7c7c5cf