ఫ్లాష్ ఫ్లాష్: బద్వేల్ బైపోల్- పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన

Badwell Bipole- Pawan Kalyan sensational statement

0
87

కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎన్ని విమర్శలు చేసినా..చివరికి, ఆ పార్టీ అభ్యర్థి కోసం మంచి మనసుతో ఆలోచించారు.

బద్వేల్ ఉప ఎన్నిక బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బద్వేల్ అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికలో జనసేన నుంచి అభ్యర్థిని పోటీకి నిలుపడం లేదని పవన్ తేల్చి చెప్పారు.వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యం కాగా..చనిపోయిన ఎమ్మెల్యే భార్యకే వైసీపీ టికెట్ ఇచ్చినందున ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నామని పవన్ ప్రకటించారు.

వాస్తవానికి బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని పార్టీ శ్రేణుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. కానీ, చనిపోయిన వ్యక్తి సతీమణిని గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నామని అన్నారు.

ఆమె ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ఇతర పార్టీలకూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పవన్ నిర్ణయంతో..బీజేపీ ఇరకాటంలో పడింది. ఉప ఎన్నికలో పోటీపై బీజేపీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో బద్వేలులో వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ ఉండనుంది. ఇటీవలే టీడీపీ సైతం ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించింది.