ప్రైవేట్ వద్దు-సర్కారే ముద్దు..!

0
113

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ఒక్కొక్క రూములో 40 నుంచి 80 మంది విద్యార్థుల వరకు కూర్చో పెడుతూ క్లాసులను చెబుతున్నట్టు తెలుస్తోంది. దాంతో తల్లిదండ్రులు భయపడుతున్నారు.

కరోనా సెకండ్ వేవ్ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. చేసేందుకు పనులు లేవు. కట్టేందుకు ఫీజులు లేవు. ఆన్‌లైన్ అరొకర క్లాసుల నడుమ ప్రయివేటు విద్యాసంస్థలు ఫీజులు గుంజుతూనే ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

ఇక ఈ ఫీజులు కట్టలేమని సర్కారు స్కూళ్ల వైపు వెళ్లారు తల్లిదండ్రులు. బతికుంటే బలుసాకు తినొచ్చన్నట్టు.. ఇప్పటి పరిస్థితుల్లో ఏదో ఒ క స్కూలు..అని సరిపెట్టుకుంటున్నారు. దీంతో ప్రయివేటు అడ్మిషన్లు పూర్తిగా తగ్గిపోయినట్టు తెలుస్తోంది.

సర్కారు బడుల్లో ఎక్కువ అడ్మిషన్లు వచ్చాయి. దీనితో క్లాసుకు 40 మంది ఉండాల్సి ఉండగా.. 60-80 మంది పిల్లల వరకు వచ్చి కూర్చున్నారు. ఇక అడ్మిషన్లు తీసుకోబోము బాబు..అని సర్కారు స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఇలా బోర్డు ఏర్పాటు చేశారు.