అమ్మకు ఆహారమే ఔషధం..గర్భిణీలకు సూచనలివే

0
116

శిశు మరణాలను నివారించాలంటే, గర్భిణిని కంటికి రెప్పలా చూసుకోవాలి. సరైన ఆహారం ఇవ్వాలి. ఆమె చుట్టూ ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలి. తగిన విశ్రాంతి అవసరం. కాబోయే తల్లికి ఆరోగ్యపరంగా ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీనివల్ల యాభైశాతం వరకూ బరువు తక్కువ శిశు జననాలను నివారించవచ్చు.

గర్భం చివరి 6-8 వారాల్లో రోజూ 20 గ్రాముల ప్రొటీన్లు, 200 క్యాలరీలు ఉన్న ఆహారం అదనంగా ఇవ్వడం వల్ల శిశువు బరువు వారానికి కనీసం 110 గ్రాములకు మించి పెరుగుతుంది. గర్భం చివరి 4-5 నెలలు ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ బిళ్లలు ఇవ్వడం వల్ల బిడ్డ మరో 300 గ్రాములు పెరుగుతుంది. చివరి 3 నెలలు గర్భిణి మధ్యాహ్నం పూట కనీసం 2 గంటలు విశ్రాంతి తీసుకోవాలి.

ప్రసవం అయిన వెంటనే శిశువుకు తల్లి చనుబాలు తాగించడం మొదలు పెట్టాలి. ఈ అలవాటును అలానే కొనసాగించాలి. దీనివల్ల రెండు మూడు రోజుల వయసు నుంచే బిడ్డ బరువు పెరగడం ప్రారంభం అవుతుంది. నెలలు నిండని శిశువులతో పోలిస్తే, నెలలు నిండి తక్కువ బరువుతో జన్మించిన శిశువులకే సమస్యలు తక్కువ.