బిగ్‌బాస్‌-15కి సల్మాన్‌ పారితోషికం ఈ రేంజ్ లోనా?

0
91

రియాలిటీ షోల్లో బిగ్‌బాస్‌కి ఉండే ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై వినోదానికి చిరునామాగా నిలిచే ఈ షో.. హిందీలో బిగ్‌బాస్‌-15 సీజన్‌ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ దీనికి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

14 వారాల పాటు కొనసాగే ఈ కార్యక్రమానికి సల్మాన్ అక్షరాలా రూ.350 కోట్లు సల్మాన్‌ తీసుకుంటున్నారని బి-టౌన్‌ టాక్‌. వరుసగా బిగ్‌బాస్‌ పదకొండు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నారు ఈ కండలవీరుడు.

అంతేకాదు.. టీవీ షోల్లో ప్రసారమయ్యే రియాల్టీ షోల్లో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే హోస్ట్‌గా నిలిచాడు ‘సుల్తాన్’. గత సీజన్ల వారీగా సల్మాన్‌ఖాన్‌ ఒక్కో వారానికి ఎంత ఆర్జించాడంటే.. (సీజన్‌ 4 – 6) వరకూ రూ.2.5 కోట్లు, (సీజన్‌-7)కి రూ.5 కోట్లు  (సీజన్‌-13)కి రూ.13కోట్లు తీసుకున్నారు.

బిగ్‌బాస్‌ తెలుగుకి గత మూడేళ్లగా హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా అలరిస్తున్నారు. ఈ ఏడాది బిగ్‌బాస్‌ సీజన్‌-5కి వ్యాఖ్యాతగా రూ.11-12 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. గతేడాది ప్రసారమైన సీజన్‌-4కి రూ.8కోట్లు తీసుకున్న నాగ్‌ ఈ ఏడాది అమాంతం తన పారితోషికాన్ని పెంచేశారు.