ప్రధానికి బాసటగా కంగనా, 61మంది ప్రముఖులు

ప్రధానికి బాసటగా కంగనా, 61మంది ప్రముఖులు

0
73

దేశంలో మూకదాడులను అడ్డుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి 49 మంది ప్రముఖులు లేఖ రాసిన మూడు రోజుల తర్వాత అందుకు స్పందనగా మరో 62 మంది ప్రముఖులు వారి వాదనను తప్పుబడుతూ శుక్రవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. ”ప్రధాని నరేంద్ర మోదీకి జులై 23, 2019న రాసిన లేఖ మమ్మల్ని విస్మయానికి గురిచేసింది. 49 మంది దేశ సంరక్షులు, విజ్ఞానవంతులు కలిసి ‘లక్షిత ఆరోపణలు’ చేయడంతో పాటు స్పష్టమైన రాజకీయ పక్షపాతం, ఉద్దేశాలను వ్యక్తపరిచారు. దీన్ని మోదీ నిరంతర కృషిని తప్పుడు చర్యగా చిత్రీకరించే ప్రయత్నంగా మేం భావిస్తున్నాం. ఆదివాసీ తెగలు, గిరిజనులపై గతంలో నక్సలైట్లు దాడులకు పాల్పడ్డప్పుడు వీరంతా ఎందుకు మౌనంగా ఉన్నారు. ‘కశ్మీర్‌లోని పాఠశాలలను తగలబెట్టండి’ అని అక్కడి వేర్పాటువాదులు బహిరంగంగా ఆదేశాలు జారీ చేసినప్పుడు ఏం చేస్తున్నారు” అని లేఖలో ప్రశ్నించారు. ఈ లేఖ రాసిన వారిలో బాలీవుడ్‌ ప్రముఖ నటి కంగనా రనౌత్‌, సెన్సార్‌ బోర్డు చీఫ్‌ ప్రసూన్‌ జోషి, దర్శకులు మధుర్‌ భండార్కర్‌, వివేక్‌ అగ్నిహోత్రి, రాజ్యసభ సభ్యులు సొనాల్‌ మాన్‌సింగ్‌తో పాటు పలువురు సినిమా ప్రముఖులు, విశ్వవిద్యాలయ ఆచార్యులు ఉన్నారు.