తెలంగాణ: హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో పదో తరగతి విద్యార్థిని ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ నీచుడు..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిలింనగర్ ప్రాంతంలో నివసించే దంపతుల కూతురు పదో తరగతి చదువుతోంది. మంగళవారం బాలిక సెల్‌ఫోన్లో చాటింగ్ చేస్తూ ఏడుస్తూ ఉండటాన్ని తండ్రి గమనించి ఏం జరిగిందని ఆరా తీశాడు.
ఇంటి సమీపంలో ఉండే మహేష్ అలియాస్ కృష్ణ చైతన్య(20), తాను కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని తండ్రికి చెప్పింది. ఈ క్రమంలోనే గత నెల 19న మహేష్ తన అక్క ఇంటికి తీసుకెళ్లాడని, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రానని చెప్పినా వినకుండా బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.