తెలంగాణ: కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మండిపడ్డారు. శాసనసభలో పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ..ఉపాధి హామీ నిధులను దారి మళ్లిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ కలగజేసుకున్నారు.
భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. అది వారి అవగాహన లోపమైనా ఉండాలి. పంచాయతీరాజ్ అని మనం పిలుస్తాం. కేంద్రంలో రూరల్ డెవపల్‌మెంట్ అని పిలుస్తాం. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఉండవు. మొన్ననే క్లియర్‌గా చెప్పినా. ఈ దేశంలో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి.
కేంద్రం వసూలు చేసే పన్నుల్లో నుంచి క్రమానుగతంగా, ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలి. కేంద్రం పోస్టు మ్యాన్‌లా మాత్రమే పని చేస్తోంది. కేంద్రం నిధులు అనేవి ఉండవు.
కేంద్రం నిధులు ఇస్తుందనడం సరికాదు. ప్రభుత్వ, సమాజ నిర్వహణలో పంచుకోబడ్డ బాద్యతల్లో కొన్ని పనులు కేంద్రం, కొన్ని పనులు రాష్ట్రం చేస్తుంది. భట్టి విక్రమార్క ప్రశ్నకు తమ వద్ద అద్భుతమైన సమాధానం ఉందన్నారు సీఎం కేసీఆర్.