హుజూరాబాద్ బరిలో నలుగురు రాజేందర్లు..ఈటెలకు తలనొప్పిగా మారనుందా?

Four Rajendars in Huzurabad ring..should spears become a headache?

0
148
Eatala Rajender

హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు కొత్త తలనొప్పి వచ్చింది. ఆయన కాకుండా రాజేందర్ పేరుతో మరో ముగ్గురు అభ్యర్థులు ఈ ఎన్నికలో పోటీ పడడమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఇమ్మడి రాజేందర్, న్యూ ఇండియా పార్టీ నుంచి ఈసంపల్లి రాజేందర్, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ నుంచి ఇప్పలపల్లి రాజేందర్ పోటీలో ఉన్నారు.

వీరందరూ నిన్ననే నామినేషన్లు వేశారు. నిన్నటితో నామినేషన్ల గడువు ముగిసింది. ఈ నెల 7వ తేదీ వరకు 15 మంది నామినేషన్లు వేయగా..చివరి రోజైన నిన్న 46 మంది కలిపి మొత్తంగా 61 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఆ ముగ్గురి ఇంటిపేర్లు కూడా ‘ఈ’తోనే ప్రారంభం కావడం గమనార్హం. దీంతో ఓట్లు ఎక్కడ చీలిపోతాయోనన్న భయం ఇప్పుడు బీజేపీ వర్గాల్లో మొదలైంది.