ఫ్లాష్- అదృశ్య‌మైన‌ బాలుడి ఘటన విషాదంతం

A boy who went missing in Rajendranagar has died

0
81

హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్‌ లో గురువారం మధ్యాహ్నం అదృశ్యమైన బాలుడి ఉదంతం విషాదాంతమైంది. ఇంటి వెనుక ఉన్న చెరువులో అనీష్‌ డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. గుంతలో పడి చనిపోయాడని పోలీసులు తేల్చారు. దీంతో బాలుడి పేరెంట్స్‌ కన్నీరు మున్నీరవుతున్నారు.

అయితే అపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదనేది అనుమానాస్పదంగా ఉందంటున్నారు బాలుడి తల్లిదండ్రులు. సీసీ కెమెరాలు పనిచేస్తే ఇంత దారుణం జరిగేది కాదంటున్నారు. అపార్ట్‌మెంట్‌ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే సీసీ కెమెరాలు ఆరు రోజులుగా పని చేయడం లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.