ఈ వారం థియేటర్ లో వచ్చే సినిమాలివే..

These are the movies coming in theaters this week ..

0
106

దసరా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వెండితెరపై చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన చిత్రాలు థియేటర్‌ల వైపు క్యూ కడుతున్నాయి. ఈ వారం కూడా కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఆ సినిమాలేంటో చూసేద్దామా!

నాగశౌర్య-రీతూవర్మ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ వరుడు కావలెను. లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించారు. అక్టోబరు 29న థియేటర్‌లలో విడుదలకు సిద్ధమైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. తమన్‌ సంగీతమందించారు. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిశోర్‌, ప్రవీణ్‌, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఆకాష్‌ పూరీ, కేతికా శర్మ జంటగా అనిల్‌ పాదూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘రొమాంటిక్‌’. పూరీ కనెక్ట్స్‌ పతాకంపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 29న థియేటర్లలో విడుదల కానుంది. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.  రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించగా, సునీల్‌ కశ్యప్‌ స్వరాలు సమకూర్చారు.