మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇంటికి తరచూ వస్తున్నాడని సొంత బావనే హత్య చేశాడు. ఈ ఘటన బైతూల్ జిల్లా, బిచుయా గ్రామంలో జరిగింది. హిరవాడి గ్రామానికి చెందిన వినోద్ పండ్రే(32).. దీపక్ కుమార్(25) సోదరిని వివాహం చేసుకున్నాడు. దీపక్ తల్లిదండ్రులతో పాటే నివసిస్తాడు. పెళ్లి అనంతరం సోదరి భర్తతో కలిసి తరచూ పుట్టింటికి వస్తుండేది. ఇది దీపక్‌కు నచ్చలేదు. తన ఇంటికి రాకూడదంటూ పలుమార్లు హెచ్చరించాడు.
ఈ క్రమంలో ఇటీవల సోదరి, బావ ఇంటికి రావడంపై గొడవకు దిగాడు దీపక్. ఈ ఘర్షణలో పండ్రేను కర్రతో బాది చంపేశాడు దీపక్. మధ్యలో కల్పించుకున్న అతని తల్లిని కూడా తీవ్రంగా గాయపరిచాడని పోలీసులు తెలిపారు.