Bigg Boss5: హాట్ టాపిక్‌గా విశ్వ రెమ్యున‌రేష‌న్..ఎంత వెన‌కేసాడంటే?

Vishwa Remuneration as a hot topic..how much is behind it?

0
76

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి బిగ్ ఎంట‌ర్‌టైన్ అందించే రియాలిటీ షో బిగ్ బాస్. ప్ర‌స్తుతం ఈ కార్య‌క్ర‌మం ఐదో సీజ‌న్ జ‌రుపుకుంటూ ఉండ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది మంది హౌజ్‌ని వీడారు. ప్ర‌స్తుతం హౌజ్‌లో ప‌ది మంది ఉన్నారు. అయితే గ‌త రాత్రి విశ్వ ఎలిమినేట్ కాగా, ఆయ‌న రెమ్యున‌రేష‌న్ అంశం ఇప్పుడు  హాట్ టాపిక్‌గా మారింది.

తొమ్మిది వారాలు ఉన్నందుకు గాను విశ్వ 22 లక్షలు అందుకున్నాడని అంటున్నారు. కాగా, విశ్వ వారానికి రెండు నుండి రెండున్నర లక్షల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు స‌మాచారం. బిగ్ బాస్ హౌజ్ నుండి ముందుగా సరయు బ‌య‌ట‌కు వెళ్లగా ఆ త‌ర్వాత ఉమాదేవి, లహరి, నటరాజ్‌ మాస్టర్‌, హమీదా, శ్వేతవర్మ, ప్రియ, లోబో ఎలిమినేట్ అయ్యారు.

తాజాగా విశ్వ ఎలిమినేట్ కాగా ఆ సంఖ్య 9కి చేరింది. అయితే బిగ్ బాస్ హౌజ్‌ని వీడే క్ర‌మంలో విశ్వ త‌న మ‌న‌సులో టాప్ 5 లో ఎవ‌రు ఉంటార‌ని చెప్పాడు. తొలి స్థానాన్ని శ్రీరామ్ చంద్ర‌కి ఇవ్వ‌గా, టాప్ 2లో ర‌వి, టాప్ 3లో ష‌ణ్ముఖ్‌, టాప్ 4లో స‌న్నీ, టాప్ 5లో సిరి ఉంటుంద‌ని అన్నాడు. జ‌నాల అభిప్రాయం కూడా దాదాపు ఇలానే ఉంద‌ని తెలుస్తుంది.