విజయ్ దేవరకొండ ‘లైగ‌ర్’ కోసం ఆ ఇద్దరు దిగ్గజాలు..!

Those two giants for Vijay Devarakonda 'Ligaur' ..!

0
112

టాలెంటెడ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ఏం చేసినా కూడా గ్రాండియ‌ర్‌గా ఉంటుంది. ఇస్మార్ట్ శంక‌ర్ వంటి భారీ హిట్ త‌ర్వాత ఆయ‌న విజయ్ దేవ‌ర‌కొండతో ‘లైగ‌ర్’ సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో విజ‌య్‌ దేవ‌ర‌కొండ‌ స‌రికొత్త పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. త‌న లుక్ కూడా ఇది వ‌ర‌కు ఏ సినిమాలో లేన‌ట్లు ఉండ‌బోతుంది. ఇక బాక్సింగ్ చిత్రం కావ‌డంతో ఈ సినిమా కోసం ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్‌ని కూడా తీసుకొచ్చారు.

మైక్ టైస‌న్ ఫ‌స్ట్ లుక్‌ను దీపావ‌ళి పండుగ‌కు విడుద‌ల చేసిన సంగ‌తి కూడా తెలిసిందే. దీనికి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌చ్చింది. లైగ‌ర్ చిత్రం హిందీ, తెలుగు భాష‌ల్లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో మైక్ టైస‌న్ పాత్ర‌కు ఎవ‌రో ఒక‌రు డ‌బ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది. ఇందుకోసం పూరీ జ‌గ‌న్నాథ్..అమితాబ్ బ‌చ్చ‌న్, బాల‌కృష్ణ‌ల‌ను సంప్ర‌దించార‌ట‌. హిందీలో బిగ్ బీ డ‌బ్బింగ్ చెప్ప‌నుండ‌గా, తెలుగులో బాల‌య్య చెబుతార‌ట‌. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న లేక‌పోయిన వార్త మాత్రం సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

లైగ‌ర్‌ మూవీ చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేయ‌డంతో పాటు ఛార్మితో క‌లిసి పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై నిర్మిస్తున్నారు. అలాగే ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో లైగ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి పూరీ జ‌గ‌న్నాథ్ ప్లాన్స్ చేసుకుంటున్నారు.