ఆగ్నేయ బంగాళాఖాతాన్ని దానిని ఆనుకుని ఉన్న ప్రాంతంలోనున్న ఉపరితల ఆవర్తనము ప్రభావం వలన అదే ప్రాంతం లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టమునకు 4 .5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది.
ఇది రాగల 36 గంటల్లో నైరుతి బంగాళాఖాతం తో పాటు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన ఈ కింది విధంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.