బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్. ఈ షోను ఆదరించేవారి సంఖ్య ఎక్కువే. బిగ్‌బాస్ షోను.. సినీ ప్రముఖులు కూడా వీక్షిస్తుంటారు అనే సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్‌కు పలువురు సినీ ప్రముఖులు తమ మద్దతు తెలిపిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక బిగ్‌బాస్ సీజన్ 5లో ట్రాన్స్‌జెండర్ ప్రియాంకకు తన మద్దతు ఉంటుందని షో ప్రారంభమైన మొదటి వారంలోనే ప్రకటించాడు మెగా బ్రదర్ నాగబాబు. ఇక ఇప్పుడు సోనూసూద్ కూడా తన మద్దతు ఇతనికే అంటూ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
లాక్డౌన్ సమయంలో ఎంతో మందికి సహయం చేసివారికి అండగా నిల్చున్నాడు సోనూసూద్. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ..వలస కార్మికులు, నిరుపేదలకు బాసటగా నిలిచాడు.. ఎంతో మందికి ఆరాద్య దైవంగా మారిపోయాడు. యావత్ దేశవ్యాప్తంగా సోనూసూద్‌కు అభిమానులు ఎక్కువే ఉన్నారు. అయితే ఎంతో పాపులారిటీ ఉన్న సోనూసూద్..తెలుగు బిగ్‌బాస్ షో గురించి స్పందించాడు..
ప్రస్తుత సీజన్లో పాల్గొన్న సింగర్ శ్రీరామ్ చంద్రకు తన మద్దతు ఉంటుందని ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. అయితే సోనూసూద్ ఇలా బిగ్‌బాస్ షోపై స్పందించడంతో అభిమానులు ఒకవైపు ఆశ్చర్యంగానూ..మరోవైపు సంతోషం వ్యకం చేస్తున్నారు.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో శ్రీరామచంద్రను చూస్తున్నారా? నేను చూస్తున్నాను.. షోలో నీ బెస్ట్ ఇవ్వు శ్రీరామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి
https://www.instagram.com/p/CWD23ZwF6XT/