Bigg Boss5: నా మద్దతు అతనికే అంటున్న సోనూసూద్ (వీడియో)

Bigg Boss 5: Sonu Sood Says My Support For Him (Video)

0
38

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్‏. ఈ షోను ఆదరించేవారి సంఖ్య ఎక్కువే. బిగ్‏బాస్‏ షోను.. సినీ ప్రముఖులు కూడా వీక్షిస్తుంటారు అనే సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్‏కు పలువురు సినీ ప్రముఖులు తమ మద్దతు తెలిపిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక బిగ్‏బాస్‏ సీజన్ 5లో ట్రాన్స్‏జెండర్ ప్రియాంకకు తన మద్దతు ఉంటుందని షో ప్రారంభమైన మొదటి వారంలోనే ప్రకటించాడు మెగా బ్రదర్ నాగబాబు. ఇక ఇప్పుడు సోనూసూద్ కూడా తన మద్దతు ఇతనికే అంటూ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

లాక్‏డౌన్ సమయంలో ఎంతో మందికి సహయం చేసివారికి అండగా నిల్చున్నాడు సోనూసూద్. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ..వలస కార్మికులు, నిరుపేదలకు బాసటగా నిలిచాడు.. ఎంతో మందికి ఆరాద్య దైవంగా మారిపోయాడు. యావత్ దేశవ్యాప్తంగా సోనూసూద్‏కు అభిమానులు ఎక్కువే ఉన్నారు. అయితే ఎంతో పాపులారిటీ ఉన్న సోనూసూద్..తెలుగు బిగ్‏బాస్‏ షో గురించి స్పందించాడు..

ప్రస్తుత సీజన్‏లో పాల్గొన్న సింగర్ శ్రీరామ్ చంద్రకు తన మద్దతు ఉంటుందని ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‏స్టాలో ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. అయితే సోనూసూద్ ఇలా బిగ్‏బాస్‏ షోపై స్పందించడంతో అభిమానులు ఒకవైపు ఆశ్చర్యంగానూ..మరోవైపు సంతోషం వ్యకం చేస్తున్నారు.. బిగ్‏బాస్‏ తెలుగు సీజన్ 5లో శ్రీరామచంద్రను చూస్తున్నారా? నేను చూస్తున్నాను.. షోలో నీ బెస్ట్ ఇవ్వు శ్రీరామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.instagram.com/p/CWD23ZwF6XT/