ఆ ఏనుగుకు కన్నడ పవర్ స్టార్ ‘పునీత్ రాజ్​కుమార్’ పేరు

The elephant is named after Kannada power star 'Puneet Rajkumar'

0
120

అభిమానుల విజ్ఞప్తి మేరకు ఏనుగుకు ‘పునీత్​ రాజ్​కుమార్’​గా నామకరణం చేశారు అధికారులు. ఇటీవల మృతిచెందిన కన్నడ పవర్​స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​కు నివాళిగా ఈ ఏనుగుకు ఆయన పేరు పెట్టినట్లు అధికారులు తెలిపారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సక్రేబైలు ఏనుగుల శిబిరంలో పవర్​స్టార్​ చివరి రోజుల్లో ఈ శిబిరాన్ని సందర్శించారని..ఇక్కడ ఏనుగులతో రెండు గంటల పాటు గడిపారని అధికారులు తెలిపారు.

రెండేళ్ల ఈ ‘పునీత్​ రాజ్​కుమార్​’ను ఇటీవల తల్లి నుండి వేరు చేశారు అధికారులు. ఆ సమయంలో ఆ పిల్ల ఏనుగు ప్రతిఘటించింది. కానీ తాళ్లతో బంధించి బలవంతంగా ఆ రెండు ఏనుగులను సిబ్బంది విడదీసి ఆ గున్న ఏనుగును వేరే ప్రాంతానికి తరలించారు. ట్రైనింగ్​లో భాగంగానే ఇలా చేశామని.. మూడు రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి ఆ తర్వాత శిక్షణ ప్రారంభిస్తామని సిబ్బంది చెప్పుకొచ్చారు.

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఆయన సమాధిని దర్శించుకునేందుకు రోజు వందల్లో అభిమానులు తరలివస్తున్నారు. ఎంతో ఫిట్‌గా ఉండే అప్పు అక‌స్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం తీవ్రం కలచివేస్తోంది. ఆయ‌నను త‌ల‌చుకుంటూ క‌న్నీరుపెట్టుకుంటున్నారు. చూస్తుంటే దీని నుంచి కన్నడ పరిశ్రమ కానీ, అభిమానులు కానీ ఇప్పుడే బయట పడేలా కనిపించడం లేదు.