ఎస్​బీఐ క్రెడిట్​ కార్డ్​ వినియోగదారులకు షాక్​..!

Shock to SBI credit card customers ..!

0
110

ఎస్​బీఐ క్రెడిట్​ కార్డు ద్వారా కొనుగోళ్లు చేసి ఈఎంఐగా చెల్లించాలి అనుకునే వారిపైఇప్పుడు మరింత భారం పడబోతోంది. డిసెంబరు 1 నుంచి క్రెడిట్‌ కార్డు ఈఎంఐలపై రూ.99 (ట్యాక్సులు అదనం) ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేయనున్నట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) వెల్లడించింది. ఇందుకు సంబంధించి క్రెడిట్‌ కార్డు కస్టమర్లకు ఈ-మెయిల్‌ సందేశం పంపింది.

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా అన్ని మర్చంట్‌ అవుట్‌లెట్లు, ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు, యాప్‌లలో జరిపే ఈఎంఐ లవాదేవీలకు ఈ ఫీజు వర్తిస్తుంది” అని ఎస్‌బీఐ వెల్లడించింది. అంటే.. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో కొని ఈఎంఐగా మార్చుకుంటే ఈ ఫీజు వసూలు చేస్తారు. ఉదాహరణకు.. మీరు ఒక ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌లో మొబైల్‌ ఫోన్‌ కొని దానికి ఈఎంఐ ఆప్షన్‌ పెట్టుకున్నారనుకోండి. ఆ చెల్లింపులను ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో చేస్తే మీరు ప్రాసెసింగ్ ఫీజు కింద అదనంగా రూ.99 ప్లస్‌ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు మీ క్రెడిట్‌ కార్డు స్టేట్‌మెంట్‌లో ఈఎంఐ అమౌంట్‌తో కలిపి కన్పిస్తుంది. ఈఎంఐగా మార్చుకునే లావాదేవీలకు మాత్రమే ఈ ఫీజును ఛార్జ్‌ చేస్తారు. అయితే ఈఎంఐ లావాదేవీ రద్దయితే ఈ ఫీజును తిరిగి ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది.

అయితే ఈ ప్రాసెసింగ్‌ ఫీజుకు కార్డు ఇంట్రెస్ట్‌ ఛార్జీలకు ఎలాంటి సంబంధం లేదు. కొన్ని సార్లు ఈఎంఐలకు మార్చుకున్నప్పుడు విక్రయదారులు వడ్డీలపై డిస్కౌంట్లు కల్పిస్తారు. జీరో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం ఉంటుంది. అలాంటి వాటికి కూడా ఈ ప్రాసెసింగ్‌ ఫీజు వర్తిస్తుందని ఎస్‌బీఐ వెల్లడించింది.