శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా దంపతులకు మరో షాక్!

Shock to Shilpa Shetty-Rajkundra couple!

0
74

బాలీవుడ్​ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్​కుంద్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. వారిపై చీటింగ్​ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఓ పోలీస్​ అధికారి తెలిపారు. ముంబయికి చెందిన నితిన్​ బరాయ్​ అనే వ్యాపారవేత్త వీరిద్దరితో పాటు మరికొంతమందిపై కేసు పెట్టినట్లు వెల్లడించారు.

శిల్పాశెట్టి, రాజ్​కుంద్రా ప్రారంభించిన ఫిట్​నెస్​ ఎంటర్​ప్రైజెస్​ కోసం దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి ఈ జంట డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగా తన దగ్గర నుంచి రూ.కోటి 51లక్షలు తీసుకున్నారని..అవి తిరిగి ఇవ్వాలని అడిగితే తనను బెదరిస్తున్నారని సదరు వ్యాపారవేత్త ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకుముందు రాజ్​కుంద్రా..అశ్లీల చిత్రాల కేసులో జైలుకెళ్లారు. ఇటీవలే ఆయన బెయిల్​పై విడుదలయ్యారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.