బీజేపీ, టిఆర్ఎస్ తోడు దొంగలు: పీసీసీ అధ్యక్షుడు రేవంత్

BJP, TRS accomplices: PCC president Rewanth

0
90

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీభవన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..దేశ స్వాతంత్య్రం కోసం పది సంవత్సరాలు జైల్లో మగ్గిన జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం ఈ దేశ ప్రజలకు ఓ పండుగ. దేశ స్వాతంత్య్రంలో ఎలాంటి పాత్ర లేని వారు. బ్రిటిష్ వారితో కాదు, అంతర్గతంగా మతాలతో కోట్లాడాలని అన్న వారిని ఈరోజు దేశ భక్తులుగా చూపిస్తున్నారు. నేటి యువతకు తప్పుడు చరిత్రను చూపిస్తున్నారు. కొంతమంది చరిత్రను వక్రీకరిస్తూ కొత్త దేశభక్తుల అవతరమెత్తారు. దేశం కోసం త్యాగం చేసిన మహా నేతలను అవమానపరిచే విదంగా ప్రవరిస్తున్నారు. ప్రజా చైతన్య యాత్రను రద్దు చేయలేదు. వాయిదా వేసాం. కలెక్టర్ లు రాజకీయ అవతారం ఎత్తారు.

టిఆర్ఎస్ ధర్నాలకు అనుమతులు ఎలా వస్తాయి. మా పార్టీకి ఎందుకు ఇవ్వరు. నిబంధనలు మాకు మాత్రమేనా..టిఆర్ఎస్, బీజేపీలకు ఉండవా. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముందు నిరసన తెలుపుతం. బీజేపీ, టిఆర్ఎస్ లు తోడు దొంగలు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి. ఒక పది వేల కోట్లు వడ్లు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించలేదా. ఇంత ధనిక రాష్ట్రంలో రైతుల కోసం ఆ మాత్రం వ్యయం చేయలేరా. కేసీఆర్ ధర్నాకు ఎందుకు బయటకు రాలేదు. వడ్లు కొననందుకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు ఓటు వేయాలి. ప్రత్యేక బడ్జెట్ పెట్టి ప్రతీ ధాన్యం గింజ కొనాల్సిందే. ఢిల్లీ జంతర్ మంతర్ లో కేసీఆర్ ఎందుకు దీక్ష చేయడు.

సీఏల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ..వారసత్వంగా వచ్చిన ఆస్తులను కూడా దేశ స్వాతంత్య్రం కోసమే జవహర్ లాల్ నెహ్రూ వదులుకున్నారు. నెహ్రూ వేసిన పునాదులే ఈ దేశం ఇంత బలంగా నిర్మాణం అవ్వడానికి కారణం. ఈ దేశంను ప్రేమించే ప్రతీ ఒక్కరు నెహ్రూకు నివాళులు అర్పించాలి. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు తమ వ్యక్తి గత స్వార్థం కోసం దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఎలాంటి సంబంధం లేని వారిని ఉద్యమకారులుగా చెప్తున్నారు. 1947 స్వాతంత్య్ర పోరాటాన్ని అవమాన పరచడం చాలా దారుణం. అలాంటి వారు దేశ ద్రోహులు. ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డగోలుగా అమ్మేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని దింపేయాల్సిన అవసరం ఉంది. హుజూరాబాద్ రివ్యూ చాలా అర్దవంతంగా జరిగింది. హుజూరాబాద్ సమీక్షపై వచ్చిన ఏ వార్త కూడా నిజం కాదని తెలిపారు.