రాజకీయ వేటలో రైతు బలి అవుతున్నాడా?

Is the farmer being victimized in the political hunt?

0
72

భారతదేశం వ్యవసాయ ఆధారితం. దేశానికి వెన్నెముక లాంటివాడు రైతు. సమస్త ప్రజలకు ఆకలి తీర్చే అన్నదాత తాను, ఎంత ఉన్నతమైన వ్యక్తికైనా తాను ఏ హోదాలో ఉన్న రైతు పండించిన పంట ద్వారానే ఆకలి తీర్చుకోగలుగుతాడు.

రైతు కల్మషం లేని వాడు. తను భూమిని నమ్ముకొని బ్రతుకుతాడు. ఆరుగాలం చెమటోడ్చి, పంట తీసి మురిసిపోతాడు. కల్లంలో గింజల్లి చూసి కడుపునిండా, తిని కంటినిండా నిద్ర పోతాడు. కుటుంబం అంతా సంతోషంగా బ్రతుకునిడుస్తాడు. ఇదంతా ఒకప్పటి మాట.

స్వతంత్రం వచ్చిన తర్వాత కాలం నుండి రైతును లాభసాటిగా, చేయాలని రైతు లేనిదే, రాజ్యం లేదని. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని అనేక నినాదాలు పుట్టుకొచ్చాయి. కానీ చివరికి రైతును నడివీధుల్లో ఉరి తీసే రోజులు తీసుకొచ్చారు మన పాలకులు.

దేశంలో ఎన్నికల కోణం నుండే, రైతును చూడటం తప్ప. తనకు అవసరమైన విధానాలపై ఏమాత్రం దృష్టి సారించడం లేదనే వాస్తవం ఉంది. వ్యవసాయ రంగం పై అనేక పరిశోధనలు, జరిగిన కమీషన్లు వేసి నివేదిక ఇచ్చినా పట్టింపులేని పాలకులు. ఏకంగా రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. ప్రైవేటు వడ్డీ ఫైనాన్స్ లు పెరిగిపోయి సరైన పంట దిగుబడి రాక పంటను నమ్ముకున్న రైతు కుతికపై, ఉరితాళ్లు వేలాడుతున్నాయి. దేశానికి అన్నం పెట్టాల్సిన చేతులు నేనేమి చేయలేనని, సమాధి అవుతున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబాలు వీధిన పడుతున్నాయి.

తనకంటూ సమయపాలన లేకుండా, నిమగ్నమై మట్టిలో నుండి సిరులను తీస్తాడు. రైతన్న మల్లె మొగ్గలు లాంటి మెతుకులను తయారు చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో నుండి నేరుగా కార్పొరేట్ వ్యవస్థలోకి వ్యవసాయాన్ని, తీసుకుపోవడానికి, మోడీ ప్రభుత్వం 3 రైతు చట్టాలను తీసుకువచ్చి, భూమి నుండి రైతును దూరం చేసే భారీ కుట్ర జరుగుతుంది. భూమి యజమాన్యం చేతిలో లేకుండా చేసి కార్పొరేట్ శక్తులు చెప్పే విధానం అమలుపరిచే మార్కెట్ను సరళతరం చేస్తున్నాడు. దీంతో పూర్తిగా రైతన్న బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకోవడం జరుగుతుంది.

మార్కెట్లో గిట్టుబాటు ధర సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకాలు మొదలైనవాటిపై, నియంత్రణ ఉండదు. దీంతో కార్పొరేట్ కంపెనీల ధరలతో రైతు బతుకు గుదిబండగా మారుతుంది. పంటకు అవసరమైన పెట్టుబడి మొత్తం కార్పొరేట్ వాళ్ళు ఇస్తారు. తద్వారా చెప్పిన పంటను మాత్రమే వేయాలనే షరతును కూడా విధిస్తారు. ఈ చట్టం అనేక లోపభూయిష్టంగా ఉందని తెలియజేస్తుంది. తద్వారా రైతు క్రమంగా కార్పొరేట్ చెప్పు చేతుల్లోకి తనకు తెలియకుండానే, వెళ్ళిపోతాడు.

దీన్ని నిరసిస్తూ గత సంవత్సర కాలం నుండి దేశ రాజధానిలో రైతులు ఉద్యమం నడిపిస్తున్నారు. కానీ ప్రభుత్వం వైపునుండి అరకొర సంప్రదింపులు జరపడం తప్ప. రైతుల లాభసాటి విషయాలపై చట్టాలను రద్దు చేసి, ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉంటామని చెప్పడం లేదు. దీంతో రైతాంగం తీవ్ర ఆందోళన స్థితిలో ఉన్నారు. అనేక లాఠీ దెబ్బలు, తుపాకీ తూటాలకు ఎదురు వెళ్లి పోరాడుతున్నారు. ఇప్పటికే కొంతమంది అమరులైనారు.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పుష్కలమైన నీటి వనరులు ఉన్న రాష్ట్రంలో అత్యధికంగా వరి వేస్తున్నా, రైతాంగంపై ధాన్యం కొనుగోలు చేయలేమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిడుగు లాంటి వార్త వినిపిస్తున్నాయి. ఏకంగా వరి వేస్తే ఉరే అంటున్న పాలకులు. అధికారంలో ఉండి సమస్యలను పరిష్కరించాల్సిన వీరు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ, రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. అధికారంలో ఉండి నిరసనలు చేయడం చేస్తున్నారు.

భవిష్యత్తులో రైతు ఎలా ముందుకు సాగాలనే విషయంపై, సరైన దిశ, దశ చూపడం లేదు. ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలపై, స్పష్టత ఇవ్వడం లేదు. పాలకులారా ఒకటి మాత్రం నిజం ఈ దేశంలో రైతాంగ తిరుగుబాటు ఉద్యమాలు నడిపారు. ప్రత్యేకంగా తెలంగాణలో రైతులే సాయుధులై పోరాడి గెలిచిన చరిత్ర కలదు. అలాంటి రైతు నేడు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలి. కావున రైతాంగ సమస్యల పట్ల పూర్తిస్థాయి విధానాల అమలు కోసం ప్రభుత్వం పని చేయాలి. ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి.

రైతు రుణమాఫీ, ఉచిత కరెంటు, ఎన్నికల హామీల వరకే పరిమితం కాకుండా సరైన గిట్టుబాటు ధరలు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు, వ్యవసాయ రంగ పరిరక్షణ తక్షణము అమలుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. రైతుల ఐక్యత కావాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తిస్తూ సంఘటిత ఉద్యమం నడపాలి.

సేకరణ: గద్దల మహేందర్