తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ భూమిక చావ్లాకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ కు జోడీగా ఖుషీ సినిమాలో నటించి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరింది. ఈ సినిమా తర్వాత ఎంతో మంది హీరోలతో యాక్ట్ చేసింది.
మహేష్ బాబు సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఒక్కడు సినిమాలో కూడా హీరోయిన్ గా భూమికా నటించింది. ఈ సినిమాతో ఆమె క్రేజ్ మరింత హైప్ అయ్యింది. భూమిక లేటెస్ట్ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సినీ క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
కమిట్ మెంట్ ఇస్తేనే ఆఫర్స్ వస్తాయా..ప్రొడ్యూసర్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉండాలా అనే ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్పింది. అవన్నీ అవాస్తవాలని, నన్నెవ్వరూ అలాంటివి అడగలేదని, తనకు కథ నచ్చి, ఆ పాత్రకు నేనే బావుంటాను అంటే తన కోసం ముంబై వచ్చి మరీ మాట్లాడేవాళ్ళని చెప్పింది. సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ పై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఈ టైమ్ లో భూమిక మాటలు ప్రేక్షకుల్ని షాక్ కి గురి చేస్తున్నాయి.