కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేసీఆర్ వ్యాఖ్యలకు జయప్రకాశ్ నారాయణ్ చురకలు

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేసీఆర్ వ్యాఖ్యలకు జయప్రకాశ్ నారాయణ్ చురకలు

0
93

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. తెలంగాణాతో జేపీకి ఏం సంబంధం .. మొదటి నుండీ జయప్రకాశ్ నారాయణ తెలంగాణా వ్యతిరేకి అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఎవరో పిచ్చోడు మాట్లాడితే పట్టించుకోవలసిన అవసరం లేదని కేసీఆర్ పరుషంగా మాట్లాడారు. అయితే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై జయప్రకాశ్ నారాయణ్ స్పందించారు. ఎవరైనా , ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాదలేనప్పుడే ఈ విధంగా ఆరోపణలు చేస్తారని జేపీ కేసీఆర్ ను ఉద్దేశించి పేర్కొన్నారు.

ఓ మనిషికి వాదించడానికి ఏమీ దొరకనప్పుడే ప్రజల సెంటిమెంట్ లను రెచ్చగొట్టే యత్నం చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడే నీ కులం ఇది, నీ మతం ఇది, నీ ప్రాంతం ఇది అనే అంశాలు తెరమీదకు వస్తుంటాయని విమర్శించారు. ఎవరైనా ఎప్పుడైనా కచ్చితమైన నిర్ణయం అయితే , సమంజసమైన పని అయితే చెప్పటానికి సంశయించరని , అలా సంశయిస్తున్నారంటే వారి వద్ద వాస్తవాలు లేవని అర్ధం అని ఆయన అన్నారు . సరైన వాదన ఉంటే దాన్నే వెలిబుచ్చుతారు తప్ప ఇలాంటి అర్థంలేని వ్యాఖ్యలు చేయరని కేసీఆర్ వ్యాఖ్యలపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు.