పోరాటం ఆపేది లేదు: రైతు సంఘాలు

The struggle does not stop: peasant unions

0
116

పార్లమెంట్​లో కొత్త సాగు చట్టాలను రద్దు చేసిన తర్వాతే ఆందోళనలు విరమిస్తామని, అప్పటి వరకు రైతుల నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయిత్​. పంటలకు కనీస మద్దతు ధర సహా ఇతర సమస్యలపై రైతులతో ప్రభుత్వం చర్చించాలని నొక్కి చెప్పారు.

గత ఏడాది తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన కొద్ది సేపటికి ట్విట్టర్​ వేదికగా ఈ విషయం వెల్లడించారు టికాయిత్​. గురునానక్​ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ..వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

https://twitter.com/RakeshTikaitBKU