దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 11,106 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. కరోనా ధాటికి మరో 459 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2020 మార్చి నాటి కనిష్ఠానికి చేరుకున్నాయి.
మొత్తం కేసులు: 3,44,89,623
మొత్తం మరణాలు: 4,65,082
యాక్టివ్ కేసులు: 1,26,620
కోలుకున్నవారు: 3,38,97,921
ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల్లో పెరుగుదల నమోదైంది. కొత్తగా 6,01,218 మందికి కొవిడ్ సోకింది. కరోనా ధాటికి 7,651 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,63,09,192 కు చేరింది. మొత్తం మరణాలు 51,46,247కి చేరాయి.