చంద్రబాబు పై రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్

Rangopal Varma's sensational tweet on Chandrababu

0
97

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడూ ఏదో ఓ విషయంపై ఏదో ఒక ట్వీట్ చేస్తూ..వివాదాలకు తెర లేపుతున్నారు ఈ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ పై సినిమాలు చేయడమే కాకుండా..రెగ్యులర్ గా అక్కడి రాజకీయాలపై కామెంట్ చేస్తూ ఉంటారు రామ్ గోపాల్ వర్మ.

మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు. దేనిపై ఆర్జీవీ తనదైన స్టైల్లో స్పందించారు. ఈ మేరకు వర్మ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

ఏడ్చే మగవాణ్ణి, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని ఎవరో పూర్వీకులు చెప్పారని నేను ఎప్పుడో విన్నాను. కానీ నేను నవ్వే ఆడదాన్ని ఇష్టపడతాను, ఎందుకంటే చూడటానికి బాగుంటుంది కాబట్టి, కానీ బలం మరియు ధైర్యం చూపించాల్సిన మగాడు పబ్లిక్ లో ఏడిస్తే జాలి కాదు, జుగుప్స పుడుతుందని పోస్ట్ చేశారు వర్మ. ఇక ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అటు టిడిపి ఫ్యాన్స్ మాత్రం వర్మ ఫైర్ అవుతున్నారు.

https://twitter.com/RGVzoomin