ప్రధాని మోదీ కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై అత్యవరసరంగా సమావేశం కానున్నారు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలతో ఉన్నతాధికారులతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ఇప్పటికే సౌతాఫ్రికా వేరియంట్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. డెల్టా కంటే ఈ న్యూ వేరియంట్ మరింత ప్రమాదకరమైనదని..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది డబ్ల్యూహెచ్‌వో. ఈ వేరియంట్‌కు ఒమిక్రాన్‌గా పేరు పెట్టింది.
ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ఇప్పటికే వంద కోట్లకుపైగా దాటిసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం 10.30 గంటలకు కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సినేషన్‌పై సమావేశం నిర్వహించారు.