ఎస్బీఐ బ్యాంకుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా భారీ షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఏకంగా రూ.కోటి జరిమానా విధించింది. కొన్ని నిబంధనలు పాటించనందుకు ఎస్బీఐకి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. బ్యాంక్ ఇచ్చిన సమాధానం, ఇతర వివరాలను పరిశీలనలోకి తీసుకుని జరిమానా విధించింది.
ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా రుణగ్రహీత కంపెనీల్లో ఎస్బీఐకి షేర్లున్నట్లు గుర్తించి..ఈమేరకు జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం కింద 1949లోని సెక్షన్ 19(2) ప్రకారం ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది.
19(2) ప్రకారం.. ఏ బ్యాంకింగ్ సంస్థ అయినా ఏ కంపెనీలోనైనా వాటాలను, తనఖాగా లేదా సంపూర్ణ యజమానిగా చెల్లించిన షేర్ క్యాపిటల్లో 30 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని కలిగి ఉండకూడదు. దీనితో ఇతర వివరాలను పరిశీలనలోకి తీసుకుని జరిమానా విధించింది.