ఎస్​బీఐ బ్యాంకుకు షాకిచ్చిన ఆర్​బీఐ..!

RBI shocks SBI Bank

0
43

ఎస్​బీఐ బ్యాంకుకు రిజర్వు బ్యాంకు ఆఫ్​ ఇండియా భారీ షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఏకంగా రూ.కోటి జరిమానా విధించింది. కొన్ని నిబంధనలు పాటించనందుకు ఎస్‌బీఐకి షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంక్‌ ఇచ్చిన సమాధానం, ఇతర వివరాలను పరిశీలనలోకి తీసుకుని జరిమానా విధించింది.

ఆర్​బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా రుణగ్రహీత కంపెనీల్లో ఎస్​బీఐకి షేర్లున్నట్లు గుర్తించి..ఈమేరకు జరిమానా విధించింది. బ్యాంకింగ్​ నియంత్రణ చట్టం కింద 1949లోని సెక్షన్‌ 19(2) ప్రకారం ఆర్​బీఐ ఈ చర్య తీసుకుంది.

19(2) ప్రకారం.. ఏ బ్యాంకింగ్‌ సంస్థ అయినా ఏ కంపెనీలోనైనా వాటాలను, తనఖాగా లేదా సంపూర్ణ యజమానిగా చెల్లించిన షేర్​ క్యాపిటల్​లో 30 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని కలిగి ఉండకూడదు. దీనితో ఇతర వివరాలను పరిశీలనలోకి తీసుకుని జరిమానా విధించింది.