‘జై భీమ్‌’ మరో ఘనత.. అంతర్జాతీయ అవార్డుకు సూర్య సినిమా నామినేట్

'Jai Bhim' is another achievement .. Surya Cinema for International Award

0
90

హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘జై భీమ్‌’. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌ వేదికగా నవంబర్ 2న విడుదలైంది. సమాజంలోని అస్పృశ్యత, అంటరానితనాన్ని ప్రశ్నిస్తూ నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రం అభిమానుల మన్ననలు అందుకుంది.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పాటు పలువురు ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులు ‘జై భీమ్‌’ సినిమాను వీక్షించి ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా ఐఏమ్‌డీబీ‌లో అత్యధికంగా 9.6 రేటింగ్ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది. తాజాగా సూర్య మూవీ ఓ అంతర్జాతీయ పురస్కారానికి నామినేట్‌ అయింది.

గోల్డెన్‌ గ్లోబ్‌… అంతర్జాతీయ చలనచిత్ర రంగంలో ఆస్కార్‌ అవార్డు తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ పురస్కారాన్ని భావిస్తారు. ఈ క్రమంలో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారానికి నామినేట్‌ అయింది ‘జై భీమ్‌’. వచ్చే ఏడాది జనవరిలో లాస్ ఏంజెల్స్‌ వేదికగా ఈ అవార్డులను అందించనున్నారు.