ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీల నిరసన

0
33

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండోరోజు కూడా తెరాస ఎంపీల నిరసన కొనసాగుతోంది. ఉదయాన్నే ఉభయ సభల్లో తెరాస ఎంపీలు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. ధాన్యం సేకరణలో జాతీయ విధానం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వరదలు, పంట నష్టాలకు పరిహారంపై చర్చించాలని నోటీసులు సమర్పించారు. రాజ్యసభలో ఎంపీ కేకే, లోక్‌సభలో నామ నాగేశ్వరరావు నోటీసులు అందించారు. సభ నుంచి కాంగ్రెస్, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్ వాకౌట్ చేశారు. విపక్షాల ఆందోళనలతో లోక్​సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.