తుమ్మితే అపశకునమా..కాదా? ఇందులో నిజమెంతంటే..

Sneezing is bad, isn't it? This is really ..

0
117

సాధారణంగా మనకు జలుబు చేస్తే తుమ్ములొస్తాయి. ఇది చిన్న అనారోగ్య సూచన. దుమ్ము రేగి నాసికను తాకినా లేక ముక్కును నలిపిన తుమ్ములొస్తాయి. ఇది ఓ క్రియకు ప్రతిస్పందన. అలాంటి తుమ్ముకీ మనిషి అదృష్టానికీ సంబంధం ఏమిటి? మనిషనేవాడికి తుమ్ములు రాక మానవు. మరి అత్యంత సహజమైన ఈ ప్రక్రియ చుట్టూ అసహజమైన నమ్మకాలు ఎలా ఏర్పడ్డాయి? అవి నమ్మకాలా? మూఢనమ్మకాలా? ఇప్పుడు తెలుసుకుందాం..

బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా తుమ్మితే ఠక్కున ఆగిపోతారు కొందరు. మరికొందరు అయితే ఆ పనిని మళ్లీ ఆరోజు అస్సలు చేయరు. మరికొందరు కాసేపు ఆగి, మంచినీళ్లు తాగి కానీ కదలరు. అదేమిటంటే అపశకునం అంటారు. నిర్లక్ష్యం చేస్తే అదృష్టం టాటా చెప్పి వెళ్లిపోతుందని, దురదృష్టం దర్జాగా వచ్చి తిష్ట వేస్తుందని అంటారు. ఓ చిన్న తుమ్ముకి ఇన్ని జరుగుతాయా అంటే సమాధానం చెప్పరు. కానీ కచ్చితంగా ఏదో జరుగుతుందని మాత్రం నమ్ముతారు.

హిందూ మతస్తుల్లో బయటకు వెళ్లేటప్పుడు తుమ్మడం మంచిది కాదు అనే నమ్మకం బలంగా ఉంది. అనారోగ్యం వల్ల వచ్చే తుమ్ములను ఎవరూ పట్టించుకోరు. కానీ బయటకు బయలుదేరుతున్నప్పుడు ఎవరైనా తుమ్మితే మాత్రం కంగారు పడిపోతారు. అపశకునమంటూ భయపడి పోతారు. అలాగే గడపకు అవతల ఒక కాలు, ఇవతల ఒక కాలు ఉన్నప్పుడు తుమ్మితే ఆయుక్షీణమంటారు. అయితే..ఇలా ఎందుకు అంటారు అన్నదానికి సశాస్త్రీయమైన ఆధారాలను మాత్రం ఎవరూ చూపించలేక పోతున్నారు.

అలాగే బైబిల్ ప్రకారం దేవుడు మనిషిని మట్టితో తయారు చేసి, అతడి నాసికా రంధ్రాల్లో జీవ వాయువును ఊది ప్రాణం పోశాడు. దీన్ని బట్టి యూదుల్లో ఒక నమ్మకం ఏర్పడింది. జీవం ఎలా అయితే ముక్కు ద్వారా శరీరంలో ప్రవేశించిందో, అలాగే బయటకు పోతుందని వాళ్లు నమ్మేవారు. తుమ్మినప్పుడు వేగంగా బయటకు పోయే గాలితో పాటు శరీరంలోని జీవం బయటకు పోతుందని, అంటే ఆ వ్యక్తి చావుకు దగ్గరైనట్లేనని ఓ నమ్మకం వారిలో ప్రబలింది.

తుమ్ము కేవలం ఆరోగ్యానికి సంబంధించినదేనని, తుమ్మితే హెల్త్ చెకప్ చేయించుకోవాలే తప్ప అనవసరమైన భయాలకు పోకూడదని వివరించారు. అప్పట్నుంచి ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చింది. తుమ్ముని అపశకునంగా కాక, శారీరకంగా జరిగే అతి సాధారణ ప్రక్రియగా చూడటం మొదలైంది. కాలం గడిచేకొద్దీ తుమ్ము చుట్టూ ఉన్న అపనమ్మకాలు, మూఢనమ్మకాలు చాలా వరకూ తొలగిపోయాయి. కానీ ఇప్పటికీ కొన్నిచోట్ల మాత్రం ఈ నమ్మకం సజీవంగానే ఉంది.