త్రివిధ దళాల్లోని ఖాళీల వివరాలను పార్లమెంట్ వేదికగా కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా ఆర్మీలోనే ఖాళీలు ఉన్నాయని, అన్ని రెజిమెంట్లు, సేవల విభాగాల్లో ఈ కొరత ఉందని తెలిపింది. ఇండియన్ ఆర్మీలోనే లక్షకుపైగా ఖాళీలున్నట్లు పేర్కొంది.
ఆర్మీలో మొత్తం 1,04,653 పోస్టులు ఖాళీలున్నాయి. అందులో 97,177 జవాన్ ర్యాంక్ పోస్టులు, మరో 7,476 ఆఫీసర్ల ర్యాంక్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.
వైమానిక దళంలో మొత్తం 5,471 ఖాళీలుండగా.. అందులో 4,850 ఎయిర్‌మెన్ ర్యాంక్ పోస్టులు, మిగిలిన 621 ఆఫీసర్ ర్యాంక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
నేవీలో మొత్తం 12,431 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. అందులో 11,166 ర్యాంక్ ఆఫ్ సెయిలర్స్.. 1,265 ఆఫీసర్ ర్యాంక్‌లు ఖాళీగా ఉన్నాయి.