ఇండియన్ ఆర్మీలో లక్ష పోస్టులు ఖాళీ..పూర్తి వివరాలివే

Lakh posts vacant in Indian Army .. Full details

0
33

త్రివిధ దళాల్లోని ఖాళీల వివరాలను పార్లమెంట్‌ వేదికగా కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా ఆర్మీలోనే ఖాళీలు ఉన్నాయని, అన్ని రెజిమెంట్లు, సేవల విభాగాల్లో ఈ కొరత ఉందని తెలిపింది. ఇండియన్​ ఆర్మీలోనే లక్షకుపైగా ఖాళీలున్నట్లు పేర్కొంది.

ఆర్మీలో మొత్తం 1,04,653 పోస్టులు ఖాళీలున్నాయి. అందులో 97,177 జవాన్​ ర్యాంక్​ పోస్టులు, మరో 7,476 ఆఫీసర్ల ర్యాంక్​ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.

వైమానిక దళంలో మొత్తం 5,471 ఖాళీలుండగా.. అందులో 4,850 ఎయిర్‌మెన్ ర్యాంక్‌ పోస్టులు, మిగిలిన 621 ఆఫీసర్​ ర్యాంక్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

నేవీలో మొత్తం 12,431 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. అందులో 11,166 ర్యాంక్​ ఆఫ్ సెయిలర్స్​.. 1,265 ఆఫీసర్​ ర్యాంక్‌లు ఖాళీగా ఉన్నాయి.

రాజ్యసభలో భాజపా ఎంపీ రాకేశ్​ సిన్హా అడిన ప్రశ్నకు భట్​ లిఖితపూర్వంగా సమాధానం ఇచ్చారు. అత్యధికంగా ఆర్మీలోనే ఖాళీలు ఉన్నాయని, అన్ని రెజిమెంట్లు, సేవల విభాగాల్లో ఈ కొరత ఉందని వెల్లడించారు. ఈ ఖాళీల భర్తీకి కేంద్రం వివిధ రకాల చర్యలు తీసుకుంటోందని వివరించారు. యువతలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.