భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్2 ఈ నెల 20వ తేదీన చంద్రుడిని సమీపించనున్నది. సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడిపై దిగనున్నదని ఇస్రో ఛైర్మన్ కె శివన్ చెప్పారు. చంద్రయాన్ ఈ నెల 20వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి చేరుతుందని, తద్వారా చంద్రుడికి సమీపంలోకి వెళుతుందని ఆయన అన్నారు. సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడిపై దిగుతుందని, ఇది తమ పూర్తి ప్రణాళిక అని ఆయన చెప్పారు. ఈ నెల 14వ తేదీ తెల్లవారుజామున మూడున్నర గంటలకు చంద్రయాన్2 ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ అనే ప్రక్రియకు లోనవుతుందని, తద్వారా భూమిని పూర్తిగా వదిలి చంద్రుడివైపు దూసుకుపోతుందని ఆయన చెప్పారు.
20న చంద్రుడిని చేరనున్న చంద్రయాన్ 2
20న చంద్రుడిని చేరనున్న చంద్రయాన్ 2