అతిలోక సుందరికి పుట్టినరోజు శుభాకాంక్షలు

అతిలోక సుందరికి పుట్టినరోజు శుభాకాంక్షలు

0
55

శ్రీదేవి అంటే అతిలోక సుందరి అనే అంటారు. ఆమె నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కంటే ముందు ఎన్నో సినిమాలు సినిమాలు చేసింది. బాలనటిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైనా శ్రీదేవి.. చిన్న తనంలోనే తనదైన శైలిలో నటించి మెప్పించింది.

1963 ఆగస్టు 13 వ తేదీన జన్మించిన శ్రీదేవి, 1967 లో వచ్చిన కణ్ణన్ కరుణై అనే సినిమా ద్వారా బాలనటిగా వెండితెరకు పరిచయం అయ్యింది. 16 ఏళ్ల వయసు సినిమాతో హీరోయిన్ గా మారింది. బాలచందర్ దర్శకత్వంలో ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు. తమిళ్ స్టార్ నటులు రజినీకాంత్, కమల్ హాసన్ లతో కలిసి ఎన్నో సినిమాలు చేసింది. 1975 నుంచి 1985 మధ్యకాలంలో శ్రీదేవి తమిళంలో టాప్ హీరోయిన్ గా కొనసాగింది.

ఇక తెలుగులో కూడా ఆమె నటించిన సినిమాలు అనేకం. అప్పట్లో ఎన్టీఆర్, నాగేస్వర రావు, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్రనటులు, ఆ తరువాత తరమైన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తదితరులతో సినిమాలు చేసింది.

ఇందులో మెగాస్టార్ తో నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి చెప్పుకోదగ్గది. ఎన్టీఆర్ తో కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి సినిమాలు చేసింది. నాగేశ్వరరావుతో ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక సినిమాలు, కృష్ణతో కంచుకాగడా, కలవారి సంసారం, కృష్ణావతారం, బుర్రిపాలెం బుల్లోడు సినిమాలు చేసింది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి బాలీవుడ్ లోను తన సత్తా చాటింది. 1978 లో శ్రీదేవి సోల్వా సావన్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ మూవీ పెద్దగా హిట్ కాలేదు. ఆ తరువాత చేసిన హిమ్మత్ వాలా సినిమా భారీ హిట్ కొట్టింది. ఆ తరువాత వచ్చిన సద్మ ఓ మైలురాయిగా నిలిచింది.

అనంతరం 1996 లో బాలీవుడ్ సినీ నిర్మాత బోనికపూర్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. జాన్వీ కపూర్, ఖుషి కపూర్. జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా చూడాలన్నది ఆమె కల. ఆ కల నెరవేరకుండానే ఆమె కన్ను మూసింది. ఫిబ్రవరి 24, 2018 వ సంవత్సరంలో శ్రీదేవి దుబాయ్ లోని ఓ హోటల్ గదిలో స్నానాల గదిలో ప్రమాదవశాత్తు టబ్ లో జారిపడి మరణించారు.