తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా రాష్ట్రంలో 38,085 కరోనా శాంపిల్స్ పరీక్షించగా 205 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 79 కొత్త కేసులు నమోదు కాగా, హన్మకొండ జిల్లాలో 19, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి.
ఈరోజు కరోనాతో 1 మంది మృతి చెందగా..ఇప్పటివరకు కరోనాతో 4002 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3871 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈరోజు కరోనా నుంచి 185 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 2,88,80,078 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.