బిపిన్ రావత్ మరణంపై స్పందించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan responds to Bipin Rawat's death

0
29

భారత త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. మన దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ కుప్పకూలిన దుర్ఘటనలో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు. రావత్, ఆయన అర్ధాంగి మధులికతో పాటు మరో 11 మంది దుర్మరణం పాలైన ఈ ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.

త్రివిధ దళాలను సమన్వయ పరిచి దేశ రక్షణ వ్యవస్థలను పటిష్ఠపరిచే కీలక బాధ్యతల్లో ఉన్న రావత్ మృతి దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు. హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ కూడా ఉన్నాడని తెలిసి బాధపడ్డానని పవన్ కల్యాణ్ అన్నారు.