అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..’పుష్ప’కు తొలిగిపోయిన అడ్డంకులు..విడుదలకు సిద్ధమే ఇక!

Good news for Allu Arjun fans .. Obstacles removed for 'Pushpa' .. Ready for release now!

0
100

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఈ సినిమానుంచి ఏచిన్న అప్ డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్  అవుతుంది సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారి చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా పుష్ప సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఫార్మాలిటీస్ పూర్తిచేసి సెన్సార్ బోర్డ్ పుష్ప చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. మొత్తానికి బన్నీ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి అన్ని అడ్డంకులు తొలిగిపోయినట్టే.

ఈ సినిమా డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ లో బన్నీ నట విశ్వరూపం చూపించారు. మాస్ పాత్రలో ఇరగదీశాడు. ట్రైలర్ ఆసాంతం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. ఒకటి రెండు చోట్ల.. రష్మిక వెంట పడుతూ కనిపించాడు పుష్పరాజ్. అలాగే ఈ సినిమా సునీల్ విలన్ గా కనిపించాడు.. అలాగే ఈ లోకం నీకు తుపాకీ ఇచ్చింది.. నాకు గొడ్డలి ఇచ్చింది.. ఎవడి యుద్ధం వాడిదే అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.