పెరుగుతున్న ఒమిక్రాన్​ కేసులు..అరికట్టడానికి 5 సూత్రాలు..అధికారులతో కేంద్రం సమీక్ష

Rising Omicron cases..Central review with authorities

0
90

దేశ వ్యాప్తంగా కొవిడ్​ పరిస్థితులపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ అధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించింది. కొవిడ్​ సంసిద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్ చర్చించారు​.

కొవిడ్​-19 క్లినికల్​ చికిత్సలో ఉపయోగించి 8 డ్రగ్స్​ బఫర్​ స్టాక్​ ఉండేలా చూసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కేసులు పెరిగితే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయా? అన్న అంశంపైనా సమీక్షించారు.

కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు, పీఎస్​ఏ ప్లాంట్లు, ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని ఆయా రాష్ట్రాలకు స్పష్టం చేశారు. టెస్ట్​, ట్రాక్​, ట్రీట్​, వ్యాక్సినేట్​, కొవిడ్​ నిబంధనలకు లోబడి ఉండటం.. అనే ఐదు సూత్రాలను ప్రధానంగా ప్రస్తావించారు రాజేశ్​ భూషణ్​. ఇవే కరోనా నివారణకు మార్గాలని అన్నారు.

హాట్​స్పాట్​లు, బ్రేక్​త్రూ ఇన్​ఫెక్షన్​ కేసుల అంశంపైనా సమీక్షలో చర్చించారు. పాజిటివ్​గా నిర్ధరణ అయిన బాధితుల సన్నిహితుల వివరాలను సేకరించి.. ప్రొటోకాల్​ ప్రకారం టెస్టులు జరపాలని ఆయన స్పష్టం చేశారు.