నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన ఈ హ్యాట్రిక్ సినిమా అంచనాలకు మించి విజయాన్ని సొంతం చేసుకుంది. చాలా మంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
ఇక తాజాగా తెలుగు దేశం అధినేత చంద్రబాబు అఖండ సినిమా చూశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది అఖండ సినిమాలో బాగా చూపించారు. సినిమాలో చూపించిన విధంగానే ఇప్పుడు ఏపీలోజరుగుతుందని సెటైర్లు వేశారు. అఖండ సినిమా చాలా బాగుందని కొనియాడారు చంద్రబాబు. చిత్రయూనిట్ కు అబినందనలు తెలిపారు.