సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

PCC chief Rewanth Reddy set fire to CM KCR

0
42

టీఆర్ఎస్ సర్కార్ పై టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. అమరులకు గుర్తింపు ఉంటుందని సీఎం ప్రజలను, ఎమ్మెల్యేలనునమ్మించాడని విమర్శించారు. అమరులకు ఉద్యోగం..ఆర్ధిక సాయం, భూమి ఇస్తా అన్నారు. అమరవీరుల స్థూపం ప్రపంచం అచ్చర్యపోయెల నిర్మిస్తాం అన్నారు. ఏడు ఏండ్లు అయ్యింది. మూడేళ్లు అసలు పట్టించుకొలేదు. 2017లో అమర వీరుల స్తూపం నిర్మాణంకి 80 కోట్లు కేటాయించింది.

ఏడాది వరకు అసలు స్థూపం గురించి పట్టించుకోలేదు. 2018 లో టెండర్ పిలిచారు. డిజైన్ అయ్యాక 63 కోట్ల 75 లక్షలతో టెండర్ పిలిచారు. ఏడాదిలో పూర్తి చేస్తాం అని కెసిఆర్ చెప్పారు. టెండర్ రెండు సార్లు వాయిదా వేసింది సర్కార్. ఈ టెండర్ కెపిసి ప్రాజెక్ట్ లిమిటెడ్ కి ఇచ్చింది. కామిషెట్టి పుల్లయ్య కంపెనీ పొద్దుటూర్ శెట్టి గారిది కంపెనీ.

కంపెనీకి ఎలాంటి అనుభవం లేకున్నా…తప్పుడు సర్టిఫికెట్ తో పనులు అప్పగించారు. 6 శాతం కన్సల్టెంట్ ఫీజు ఇస్తుంది. రేకులు, ఇనుముతో కట్టిన నిర్మాణంకి 177 కోట్లకు వ్యయం పెంచారు.127 కోట్ల మేర అంచనా పెంచారు. కేటీఆర్ నీ మెప్పించి వ్యయం పెంచుకున్నాడు. 177 కోట్లకు వ్యయం పెంచినా..పనులు పూర్తి కాలేదు 12 నెలల్లో పూర్తి చేయాల్సిన పని నాలుగున్నర నెలలు అయ్యింది. అమర వీరుల స్తూపం మొండి గోడలుగా నిలబడింది 60 కోట్లతో మొదలైన స్థూపం.. 180 కోట్లకు పెంచారు.

సీఎం పక్కనే ఉన్న సచివాలయం సందర్శన చేసి దసరా లోపు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సచివాలయం కట్టుకుంటావా..సమాధి కట్టుకుంటావా నీ ఇష్టం కానీ అమర వీరుల స్తూపం సంగతి ఎంటి అమరవీరుల స్థూపం నిర్మాణం పొద్దుటురు వారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది.

తెలంగాణలో ఎవరు అర్హులు లేరా. పిడికెడు ఆంధ్ర కాంట్రాక్టర్ లు తెలంగాణని దోచుకుంటున్నారు అని చెప్పింది నువ్వే కెసిఆర్. డిఎన్ఎ టెస్ట్ చేయాలి అసలు తెలంగాణ వాడే నా అని తేలాలి టీ హబ్ నిర్మాణంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టింది అని చెప్పిన సంస్థనే కాగ్ కే అమర వీరుల స్తూపం నిర్మాణం పనులు ఇచ్చింది. 300 శాతం బడ్జెట్ పెంచారు.

ఈ అవినీతికి కేటీఆర్, అతని ఫ్రెండ్ తెలుకుంట శ్రీధర్ కారణం. ఈ కుంభకోణం బయట పడాలంటే.. విచారణ కమిటీ వేయాలి. ఆలస్యానికి కారణం ఏంటో బయట పడాలి. ఆంధ్ర కాంట్రాక్టర్ కు ఇవ్వడానికి కారణం ఏంటీ. కెసిఆర్ కుటుంబాన్నివెలివేయాలి. సాంఘీక బహిష్కరణ చేయాలి. ఎవరి శుభకార్యాలకు పిలువొద్దు, వాళ్ళ పిల్లలకు పిల్లను ఎవరు ఎవ్వొద్దు. ఇచ్చిన మాట తప్పినందుకు కెసిఆర్ ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.