బాలీవుడ్ యువ హీరోయిన్ సారా అలీఖాన్ టాలీవుడ్ రౌడీహీరో విజయ్‌దేవరకొండపై ప్రశంసలు కురిపించింది. విజయ్ తన ఫేవరెట్ స్టార్ అని, ఆయనతో కలిసి ఓ సినిమా చేయాలని ఉందని తమ మనసులో మాటను తెలిపింది.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ..దక్షిణాదిలో ఏ హీరోతో సినిమా చేయాలని ఉందని అడగ్గా.. ఈ విషయాన్ని చెప్పింది. దీంతో పాటే విజయ్ చాలా హాట్‌గా ఉంటారని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం విజయ్ పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైగర్’ చిత్రంలో నటిస్తున్నారు. అనన్యా పాండే హీరోయిన్. దిగ్గజ బాక్సర్ మైక్‌టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.