ఆ టాలీవుడ్ హీరో చాలా హాట్‌..హీరోయిన్ సారా అలీఖాన్ షాకింగ్‌ కామెంట్స్‌

0
36

బాలీవుడ్​ యువ హీరోయిన్​ సారా అలీఖాన్​ టాలీవుడ్​ రౌడీహీరో విజయ్​దేవరకొండపై ప్రశంసలు కురిపించింది. విజయ్​ తన ఫేవరెట్​ స్టార్​ అని, ఆయనతో కలిసి ఓ సినిమా చేయాలని ఉందని తమ మనసులో మాటను తెలిపింది. ​

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ..దక్షిణాదిలో ఏ హీరోతో సినిమా చేయాలని ఉందని అడగ్గా.. ఈ విషయాన్ని చెప్పింది. దీంతో పాటే విజయ్​ చాలా హాట్​గా ఉంటారని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం విజయ్​ పూరీజగన్నాథ్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైగర్’​ చిత్రంలో నటిస్తున్నారు. అనన్యా పాండే హీరోయిన్​. దిగ్గజ బాక్సర్​ మైక్​టైసన్​ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.