ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఓ విచిత్ర ఆంక్షలను అమలు చేసింది ఆ దేశం. ఉత్తరకొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ మరణించి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో 11 రోజుల పాటు నవ్వొద్దు, ఏడ్వొద్దు, తాగొద్దు, వేడుకలు చేసుకోవద్దని ప్రజలను ఆదేశించింది.
ఈ సంతాప దినాల సమయంలో మనం మద్యం సేవించకూడదు. నవ్వకూడదు. వేడుకల్లో పాల్గొనకూడదు’ అంటూ రేడియో ఫ్రీ ఆసియా ప్రభుత్వ ఆదేశాలను వెల్లడించింది. డిసెంబర్ 17న ఆ దేశ ప్రజలు ఎవరూ నిత్యావసరాలు కొనేందుకు దుకాణాలకు వెళ్లకూడదు. ఈ సమయంలో ఎవరైనా మరణిస్తే మృతుడి కుటుంబ సభ్యులు బిగ్గరగా ఏడవకూడదట.
పుట్టిన రోజులు జరుపుకోవడానికి వీలు లేదు. ఇలా పలు ఆంక్షలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో సంతాపదినాల సమయంలో ఆదేశాలకు విరుద్ధంగా కొందరు తాగుతూ పట్టుబడ్డారు. వారిని నేరస్థుల్లా పరిగణిస్తూ.. శిక్షలు వేశారు. ఆ తర్వాత వారి జాడ లేకుండా పోయిందని ఆ వర్గాలు వెల్లడించాయి.
కిమ్ జోంగ్ ఇల్ 1994 నుంచి 2011 వరకు ఉత్తర కొరియాను పాలించారు. తన నియంతృత్వ వైఖరితో ప్రజలకు స్వేచ్ఛను దూరం చేశారు. 2011, డిసెంబర్ 17న గుండెపోటుతో మరణించారు. ఇల్ మూడో కుమారుడే కిమ్ జోంగ్ ఉన్. కిమ్ జోంగ్ ఇల్ వర్థంతి రోజున ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు సంతాప దినాలు జరుగుతాయి. ఈసారి 10వ వర్థంతి కావడం వల్ల ఆ సంఖ్యను 11 రోజులకు పెంచారు.