ఎస్​బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్..ఎస్‌బీఐ 3-ఇన్‌-1 ఖాతా..ప్రయోజనాలివే

Good news for SBI clients..SBI 3-in-1 account..benefits

0
107

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) తమ వినియోగదారుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే కస్టమర్లకు జీరో బ్యాలెన్స్‌, జన్‌ధన్‌, సేవింగ్స్‌, కరెంటు ఇలా పలు రకాల ఖాతాలు అందిస్తోంది. తాజాగా మరో కొత్త రకం ఖాతాను అందుబాటులోకి తీసుకొచ్చింది.

దేశంలో స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో అనేక మంది డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలు తెరుస్తున్నారు. అయితే, చాలా మంది వీటి కోసం ప్రైవేటు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఎస్‌బీఐ వారందరినీ సురక్షితమైన ప్రభుత్వం రంగ బ్యాంకు వైపు మళ్లించేందుకు 3 ఇన్‌ 1 ఖాతాను తీసుకొచ్చింది. దీంట్లో సేవింగ్స్‌ ఖాతాతో పాటు డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలు కూడా ఉంటాయి.

ఎస్‌బీఐ త్రీ ఇన్ వన్ అకౌంట్ హోల్డర్స్ 25 శాతం మార్జిన్స్‌తో ట్రేడ్ చేయొచ్చు. దీన్ని ఈ-మార్జిన్‌ ఫెసిలిటీగా వ్యవహరిస్తున్నారు.

మార్జిన్‌ స్టాక్స్‌ లేదా నగదు రూపంలో ఉంటుంది. కస్టమర్లు తమకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

30 రోజుల వరకు పొజిషన్స్‌ను క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు.

ట్రేడింగ్ స్టాక్స్‌ని డెలివరీగా మార్చుకోవచ్చు. ఎక్స్‌పైరీ లోపు స్క్వేర్ ఆఫ్ కూడా చేయొచ్చు.

వీటితో పాటు సేవింగ్స్‌ ఖాతా ద్వారా అందే అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి.