చిరంజీవి ఆచార్య రిలీజ్ వాయిదా? క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు..ఏమన్నారంటే?

Chiranjeevi Acharya's release postponed? Producers who gave Clarity..what?

0
49

సంక్రాంతి రిలీజ్​కు టాలీవుడ్​ ముస్తాబవుతోంది. ఆ తర్వాత రాబోయే సినిమాలు కూడా చివరిదశ పనుల్లో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే సంక్రాంతి రేసులో పవన్-రానా బీమ్లానాయక్, ప్రభాస్ రాధేశ్యామ్, ఎన్టీఆర్, రాంచరణ్ RRR, చిరంజీవి ఆచార్య ఉన్నాయి. అయితే గత కొన్నిరోజుల నుంచి ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

చిరు ‘ఆచార్య’ వాయిదా అంటూ ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. దీనితో మెగా అభిమానులు అసంతృప్తికి గురయ్యారు. తాజాగా ఈ వార్తలపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. బయట వస్తున్న వదంతులు ఏం నమ్మొద్దని, చెప్పిన ప్రకారం ఫిబ్రవరి 4నే మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ థియేటర్లలోకి వస్తుందని ప్రకటనలో తెలియజేశారు.

దేవాలయాల నేపథ్య కథతో తీసిన ‘ఆచార్య’ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్​గా నటించగా, రామ్​చరణ్-పూజా హెగ్డే ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. మణిశర్మ సంగీతమందించారు. కొరటాల శివ దర్శకత్వం వహించారు. మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.