గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నారా? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

Using Google Pay, Phone Pay? Be sure to know these things

0
45

భారత ప్రభుత్వం చేపట్టిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమం మొదలైన తర్వాత యూపీఐ ట్రాన్సాక్షన్స్‌ బాగా పెరిగిపోయాయి. యూపీతో క్షణాల్లో నగదు బదిలీ చేసుకునే సౌకర్యం ఉండటంతో ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యాప్స్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది.

క్షణాల్లో బ్యాంకుల ప్రమేయం లేకుండా క్షణాల్లో నగదును ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నాం. పాన్‌ షాపు నుంచి మెడిసిన్స్‌ షాపుల వరకు అందరూ యూపీఐ పేమెంట్స్‌కు అలవాటు పడ్డారు. దీంతో కొత్త సైబర్‌ నేరస్తులు కూడా కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ క్యూ ఆర్‌ కోడ్‌లను, అడ్రస్‌లను యూజర్లకు గాలం వేసి డబ్బులను కాజేస్తున్నారు. ఇలాంటి నేరాల నుంచి తప్పించుకోవాలంటే యూపీఐ పేమెంట్స్‌ విషయంలో పలు సూచనలను పాటిస్తే సురక్షితంగా ఉండవచ్చును.

మీ యూపీఐ చిరునామాను ఎప్పుడూ తెలియని వారితో పంచుకోవద్దు. యూపీఐ చిరునామాను సురక్షితంగా ఉంచడం అత్యంత కీలకమైన భద్రతా చిట్కా. ఏదైనా చెల్లింపు లేదా బ్యాంక్ అప్లికేషన్ ద్వారా మీ యూపీఐ ఖాతాను యాక్సెస్ చేయడానికి మీరు ఎవరినీ అనుమతించకూడదు.

మీరు వాడే గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్‌కు శక్తివంతమైన స్క్రీన్‌ లాక్‌ను ఏర్పాటు చేయడం మంచింది. మీ డేట్‌ ఆఫ్‌ బర్త్‌ను, మొబైల్ నంబర్ అంకెలను,  స్క్రీన్‌ లాక్‌గా ఉంచకూడదు.  మీ పిన్‌ను ఎవరితోనూ షేర్ చేయకూడదు ఒకవేళ మీ పిన్ బహిర్గతమైందని మీకు అనుమానం వస్తే, వెంటనే దాన్ని మార్చండి.

సైబర్‌ నేరస్తులు కొంత పుంతలు తొక్కుతూ..యూపీఐ పేమెంట్స్‌ లింక్స్‌ను యూజర్లకు పంపిస్తున్నారు.  యూపీఐ స్కామ్ అనేది యూజర్లను ట్రాప్ చేయడానికి హ్యాకర్లు ఉపయోగించే ఒక సాధారణ టెక్నిక్. హ్యాకర్లు సాధారణంగా లింక్‌లను షేర్‌ చేస్తూ లేదా కాల్ చేసి డబ్బులను ఊడ్చేస్తారు. మీరు అలాంటి లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయకూడదు. మీ పిన్ లేదా మరేదైనా సమాచారాన్ని ఎవరితోనైనా షేర్ చేయకూడదు. బ్యాంకులు ఎప్పుడూ పిన్, ఓటీపీ, మరే ఇతర వ్యక్తిగత వివరాలను అడగవు.

ఆయా యూపీఐ పేమెంట్స్‌ యాప్స్‌ భారీగా ఆఫర్లను ఇస్తున్నాయని చెప్పి ఒకటి, రెండు కంటే ఎక్కువ యూపీఐ యాప్స్‌ వాడడం మంచింది కాదు. ఆయా యూపీఐ యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ ఉండాలి. కొత్త అప్‌డేట్‌లు మెరుగైన UI , కొత్త ఫీచర్‌లు మీకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. యాప్‌లను తాజా వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేయడంతో మీ యూపీఐ ఖాతాలను సురక్షితంగా ఉంచుతుంది.